అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన 'ఫిట్టింగ్ మాస్టర్' సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ మాదాల్సా శర్మ ఇప్పుడు హాట్‌గా వార్తల్లోకెక్కింది. ఎందుకంటారా? ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుంది. ఇందులో విచిత్రం ఏముందంటారా? ఉంది మరి.
అలా ఇలా జరిగిందనుకుంటున్నారా ఆ పెళ్లి..? ఎలా జరిగినా పెళ్లి జరగడంలో వింతేముంటుంది అనుకుంటే మాత్రం మీకు అసలు సంగతి తెలియాల్సిందే. ప్రముఖ బాలీవుడ్ నటుడు మిధున్ చక్రవర్తి తనయుడు మహాక్షయ్ చక్రవర్తితో కొంతకాలంగా ప్రేమలో ఉంది మాదాల్సా శర్మ. పెద్దలను ఒప్పించి, పెళ్లికి రెడీ అయ్యారు. ముహూర్తం ఖరారయ్యింది. ఇంతలో ఓ హీరోయిన్ తనను మహాక్షయ్ మోసం చేశాడనీ, తనపై అత్యాచారం కూడా చేశాడనీ ఆరోపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు మహాక్షయ్‌ని అరెస్టు చేశారు.
ఈ కేసులో బెయిల్ పొందిన వెంటనే మాదాల్సను వివాహమాడాడు మహాక్షయ్. మహాక్షయ్ ఎలాంటి వాడో తనకు బాగా తెలుసనీ, కుట్రపూరితంగా కొందరు తనను ఈ కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారనీ మాదాల్సా చెప్పుకొస్తోంది. మహాక్షయ్ గురించి పూర్తిగా తనకు తెలుసనీ, ఖచ్చితంగా ఈ కేసు నుండి నిరపరాధిగా బయటికొస్తాడనీ మాదాల్సా భావిస్తోంది.
మొత్తానికి సినిమా స్టైల్లోనే ఉంది కదా ఈ ముద్దుగుమ్మ ప్రేమ, పెళ్లి ఎపిసోడ్. అందుకే మరి టాలీవుడ్‌తో పాటు, బాలీవుడ్‌లో కూడా ఈ బ్యూటీ పెళ్లి ఎపిసోడ్ ఇంత హాట్ టాపిక్ అయ్యింది మరి.