'రోబో 2.0' రిలీజ్‌ డేట్‌ ఫిక్సయ్యింది.!

మరిన్ని వార్తలు

ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావల్సిన 'రోబో 2.0' చిత్రం ఇప్పటికీ విడుదల కాలేదు. ఇదిగో వస్తుంది. అదిగో వస్తుంది అంటూ రెండు మూడు సార్లు హడావిడి జరిగినా విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఫైనల్‌గా ఓ డేట్‌ ఫిక్స్‌ చేశారు. ఈ సారైనా వస్తుందా? అంటే ఈసారి పక్కా అంటున్నారు. 

ఇంతకీ '2.0' రిలీజ్‌ డేట్‌ ఎప్పుడని తెలుసుకోవాలనే ఆశక్తి చాలా ఎక్కువగా ఉంది కదా. ఈ ఏడాదిలోనే. నవరబర్‌ 29. హమ్మయ్య తెలిసిపోయింది అనుకుంటున్నారా..! అవును ఈ డేట్‌కే 'రోబో 2.0' ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. అసలీ ఏడాది విడుదల కాదనే అనుకున్నారు. మొత్తానికి ఎలాగోలా విజువల్‌ పార్ట్‌ కంప్లీట్‌ చేసి, ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

 

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. బాలీవుడ్‌ ప్రముఖ హీరో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటిస్తున్నాడు. బాలీవుడ్‌ బ్యూటీ అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వెండితెర విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన 'రోబో' చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతోందీ చిత్రం. 

అయితే సీక్వెల్‌ అయినా కానీ కథ పరంగా దీనికీ, దానికీ ఎక్కడా పోలిక ఉండదట. పూర్తిగా కొత్త కథా, కథనాలతో 'రోబో 2.0' ఉంటుందని డైరెక్టర్‌ శంకర్‌ అన్నారు. అయితే విజువల్‌గా 'రోబో'ని మించి ఉంటుందట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS