హీరోయిన్ మాధవీ లతకి బాగా కాలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. అలా ఆమెకి అంతలా కాలడానికి కారణం ఎవరో తెలుసా? తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు. సినీ నటుడు, జనసేన పార్టీ అధినాయకుడు పవన్‌కళ్యాణ్ తెలుగుదేశం పార్టీపై రాజకీయ విమర్శలు చేస్తుండడంతో టీడీపీ నుంచీ పవన్‌కళ్యాణ్‌పై అదే స్థాయిలో విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఈ విమర్శల్లో ఓ మహిళా నేత యామిని బాగా హైలైట్ అయ్యారు.
సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలకు మాధవీ లత కౌంటర్ ఇస్తూ, 'నాకు కాలింది..' అంటూ మొదలు పెట్టి కడిగి పారేశారు. మాధవీ లత ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో వున్నారు. బీజేపీలో వున్నప్పటికీ తాను పవన్‌కళ్యాణ్‌కి వీరాభిమానినని మాధవీలత చెబుతోంది. పవన్‌కళ్యాణ్ మీద గతంలో శ్రీరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పవన్‌కళ్యాణ్‌కి మద్దతుగా మాధవీలత ఆందోళన చేపట్టిన సంగతి తెల్సిందే. పవన్‌కళ్యాణ్ మీద అభిమానం వుంటే, జనసేనలో చేరాలి కదా? అన్న ప్రశ్నకి.. అది సినీ అభిమానం, ఇది రాజకీయ అభిమానం అని మాధవీ లత చెప్పింది.
వేరే పార్టీలో వుంటూ కూడా పవన్‌కళ్యాణ్ మీద అభిమానం చూపించడం అభినందించదగ్గ విషయమే. మరి పవన్‌కళ్యాణ్, బీజేపీ మీద విమర్శలు చేసినప్పుడూ, మాధవీలత పవన్‌కళ్యాణ్‌ని వెనకేసుకొస్తుందా? అనేది అభిమానుల ప్రశ్న.