సినిమా విడుదలై రోజులు గడుస్తున్నా.. ఇంకా 'అరవింద సమేత'పై మిక్స్‌డ్ టాక్ కొనసాగుతూనే వుంది. టాక్‌తో సంబంధం లేకుండా, వసూళ్ళ ప్రభంజనం అయితే తగ్గలేదు 'అరవింద సమేత'కి. ఈ సినిమాకి సీజన్ కలిసొచ్చిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
8 రోజులకు గాను తెలుగు రాష్ట్రాల్లో 'అరవింద సమేత' 60 కోట్ల 85 లక్షల షేర్ వసూలు చేయడమంటే చిన్న విషయం కాదు. అయితే, ఈ వారాంతం తర్వాత 'అరవింద సమేత' పరిస్థితి ఏంటన్నదే సస్పెన్స్. ఎందుకంటే, ఆదివారంతో సెలవులు ముగిసిపోతాయ్ మరి. మరోపక్క ఓవర్సీస్‌లోనూ 'అరవింద సమేత' వసూళ్ళు స్టడీగానే కన్పిస్తున్నాయి. అయితే ఓవర్సీస్‌లో 'అరవింద సమేత' అంచనాల్ని అందుకోలేకపోయిందనీ, అందుక్కారణం సినిమాలో వినోదం పెద్దగా లేకపోవడమేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సినిమా రిలీజ్‌కి ముందు 100 కోట్ల వసూళ్ళపైనే యంగ్ టైగర్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే, 100 కోట్లను 'అరవింద సమేత' టచ్ చేస్తుందా.? లేదా.? అనేదానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే వుంది. సోమవారం ఈ విషయపై పూర్తిస్థాయి స్పష్టత వస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన 'అరవింద సమేత' సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటించిన సంగతి తెల్సిందే.
ప్రస్తుతం 'అరవింద సమేత' సినిమా ప్రమోషన్లలో బిజీగా వున్న యంగ్ టైగర్, తన తదుపరి సినిమాకి కాస్త గ్యాప్ తీసుకుని సన్నద్ధమవుతాడట.