తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అంటూ శ్రీరెడ్డి చేసిన అర్ధ నగ్న ప్రదర్శన ఇటీవల పెద్ద దుమారమే లేపుతూ, రకరకాల మలుపులు తిరుగుతూ వచ్చింది.
నేడు ఈ కాస్టింగ్ కౌచ్ వివాదం కాస్తా, పవన్ కళ్యాణ్‌పై అసభ్య ఆరోపణల దాకా చేరడంతో, వివాదం మరో రకంగా ముదిరి పాకాన పడింది. తాజాగా మరో సినీ నటి మాధవీలత పవన్‌కళ్యాణ్‌పై శ్రీరెడ్డి అసభ్య పదజాలంతో ఆరోపణలు చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ, ఫిలిం నగర్‌లో మౌన దీక్షకు దిగింది. ఆమె వెంట పలువురు పవన్ అభిమానులు కూడా చేరడంతో, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలున్న నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు.
మాధవీలత చేస్తున్న మౌనదీక్షకు అభ్యతరం తెలపడంతో, 'మాది మౌన పోరాటం. ఈ పోరాటం కారణంగా ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులకు తావుండదు. న్యాయం కోసం జరుగుతున్న మా ఈ పోరాటానికి దయచేసి పర్మిషన్ ఇవ్వండి..' అని పోలీసులను కోరింది మాధవీలత. అంతేకాదు, ఒకవేళ ట్రాఫిక్ ఆంక్షల కారణంగా మాధవీలతను అదుపులోకి తీసుకున్న క్రమంలో స్టేషన్‌లోనైనా మౌనదీక్షకు దిగుతానని మాధవీలత చెప్పింది. మొత్తానికి కాస్టింగ్ కౌచ్ అంటూ మొదలైన ఈ వివాదం ఇప్పుడు అసభ్య పదజాలంపై పడింది.
అవును నిజమే, శ్రీరెడ్డి ఉపయోగిస్తున్న అసభ్య పదజాలం సమాజం సిగ్గుపడేలా ఉంది. లైవ్‌లో ఆమె వాడుతున్న అసభ్య పదజాలాన్ని మీడియా కూడా ఖండించడం లేదు. ఇది నిజంగా బాధాకరమైన అంశమే. ఇందుకు ఏదో ఒక రకంగా అడ్డుకట్ట వేయకుంటే కష్టమే. ఈ క్రమంలో మాధవీలత చేపట్టిన ఈ దీక్షకు ఎంత మంది మద్దతు పలుకుతారో వేచి చూడాల్సి ఉంది.