అసలీ టాలీవుడ్‌కి ఏమైంది.? మొన్న శ్రీరెడ్డి, ఇప్పుడు మాధవీలత ఓ వైపు కాస్టింగ్ కౌచ్, ఇంకోవైపు సెక్స్ రాకెట్.. ఇలా ఒక్కటేంటి? చెప్పుకుంటూ పోతే, జరుగుతున్న పరిణామాలకు భారీ మూల్యం చెల్లించేదెవరు? సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు రెచ్చిపోతున్నారు. మొన్న శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ అంటూ చేసిన రాద్ధాంతం అందరికీ తెలిసిందే. ఇప్పుడు చికాగోలో సెక్స్ రాకెట్ అంటూ మన తెలుగు మీడియా చూపిస్తోన్న అత్యుత్సాహం ఏపాటిదో చూస్తున్నదే.
ఇదంతా ఇలా ఉంటే, తాజాగా నటి మాధవీ లత సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సెక్స్ రాకెట్ విషయంలో సోషల్ మీడియా వేదికగా వస్తున్న తనపై వస్తున్న కామెంట్స్‌కి అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. తనను కామెంట్ చేస్తున్న వారికి ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. 'ఫేస్‌బుక్‌లోనూ, యూ ట్యూబ్‌లోనూ తెగ బలిసిన కుక్కల వాగుడుకు నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జరిగేవి జరుగుతాయి. వేటినీ ఆపడం సాధ్యం కాదు. అయినా ఆపడానికి నేనేం సీఎంని కాదు, పీఎంని కాదు జస్ట్ ఏ కామన్ గాళ్..ఇప్పుడు నన్ను బూతులు తిడుతున్న చెత్త నా డాష్ గాళ్లకి సమాధానం ఇచ్చే అవసరం నాకు లేదు.
నేను ఓ పొలిటికల్ పార్టీలో ఉన్నాను. కానీ ఎవరికీ ఎలాంటి ప్రమాణాలు చేయలేదు. ఏ విషయంలోనైనా నేను ప్రమాణం చేసిన రోజు అడగండి..' అని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది మాధవీలత. 'ఇది కేవలం సంస్కారం లేని వాళ్లకు మాత్రమే..' అని ఆమె తన కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేసింది.
ఏది ఏమైనా ఈ జరుగుతున్న పరిణామాలన్నీ, తెలుగు ఇండస్ట్రీ పరువును రచ్చకీడుస్తున్నవే అని చెప్పక తప్పడం లేదు.