నాకు ఆ ప్రైవసీ ఉండట్లేదు: రేణు దేశాయ్

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ త్వరలోనే రెండవ వివాహం చేసుకోబోతున్నట్టుగా జరుగుతున్న పరిణామాల బట్టి అర్ధమవుతున్నది.

ఈ మధ్యనే తన సోషల్ మీడియాలో ఒక ఫోటో పెట్టి జీవితాంతం నువ్వు నాతోనే ఉంటావు.. ఉండాలి అని కోరుకుంటున్నట్టుగా ఒక పోస్ట్ రాసింది. ఇక తాజాగా కూతురు, కొంతమంది సన్నిహితులతో గోవాకి వెళ్ళిన రేణు తనకి కాబోయే వాడి మెసేజులు చదివే సమయంలో డిస్టర్బ్ చేస్తూ తనకి ప్రైవసీ ఇవ్వడం లేదు అంటూ సరదాగా ఒక పోస్ట్ పెట్టింది.

దీనితో ఈమె తన పెళ్ళికి సంబంధించి ఒక హింట్ ఇవ్వకనే ఇచ్చేసినట్టుగా అర్ధమవుతున్నది. అయితే గతంలో ఆమె తన రెండవ పెళ్ళి గురించి ప్రస్తావిస్తేనే పవన్ అభిమానులు అనే కొందరు ఆమె పైన అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. వాటికి ఆమె కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చేసింది.

ఇంతకీ ఆమె చేసుకోబోయే వరుడు ఎవరు అన్నది ఇంతవరకు తెలియరాలేదు


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS