జక్కన్న ఇప్పుడేం చేస్తున్నట్టో.!

By iQlikMovies - August 14, 2018 - 14:52 PM IST

మరిన్ని వార్తలు

'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా కీర్తి పతాకం ప్రపంచ నలుమూలలా ఎగరేసిన అసలు సిసలు తెలుగోడు జక్కన్న రాజమౌళి ఆ సినిమా విజయం నుండి ఇంకా తేరుకోలేకపోతున్నాడు. జక్కన్నని 'బాహుబలి' విజయం వెంటాడుతూనే ఉంది. ఎంతలా అంటే మరో చిన్న సినిమాని టచ్‌ చేసే సాహసం చేయలేనంతగా. అందుకే 'బాహుబలి' తర్వాత తన టాలెంట్‌ని మరో పెద్ద సినిమా కోసమే వినియోగించాలనుకుంటున్నాడట. 

ఆ కోవలో అనౌన్స్‌ అయిన బిగ్‌ ప్రాజెక్టే 'ఆర్‌ఆర్‌ఆర్‌' మల్టీ స్టారర్‌ ప్రాజెక్ట్‌. అయితే ఈ ప్రాజెక్ట్‌ ఇప్పుడెంత వరకూ వచ్చినట్లు. నో క్లారిటీ. అసలింతకీ ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కేదేనా? అంటే నో క్లారిటీ. ఇలా 'నో' అనే సింగిల్‌ లెటర్‌ డైలమాలే ఈ ప్రాజెక్ట్‌ విషయంలో గుద్దులాడుకుంటున్నాయి. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ మల్టీ స్టారర్‌ ప్రాజెక్ట్‌ ఇది. ఈ సినిమాలో ఈ ఇద్దరు స్టార్‌ హీరోలు పలానా పాత్రల్లో నటిస్తారంట అంటూ మొన్నామధ్య కథలు కథలుగా న్యూస్‌ వెలుగులోకి వచ్చాయి. అయితే అవేమీ నిజం కాదనేది తాజా సమాచారమ్‌. 

అసలింతకీ ఈ సినిమాకి కథ ఇంకా ప్రిపేర్‌ కాలేదనేది తాజాగా అందుతోన్న సమాచారమ్‌. పలు విజయవంతమైన సినిమాలకు స్టోరీలు అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ ఈ చిత్రానికి కథ తయారు చేసే పనిలో నిరంతరం నిమగ్నమై ఉన్నారట. కానీ కథ ఓ కొలిక్కి రావట్లేదనీ తెలుస్తోంది. త్వరలోనే కథ విషయంలో ఈ తండ్రీ కొడుకులు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయనీ సూచనప్రాయంగా తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS