ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ బాలాజీ పైన ఈ మధ్యనే ఒక మహిళ ని ఆర్ధికంగా మోసం చేసినట్టుగా హైదరాబాద్ లో ని ఒక పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయిన సంగతి విదితమే.
ఇక ఆ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే, 2016లో తన భార్య కృష్ణవేణికి ఒక కిడ్నీ అవసరమై హైదరాబాద్ కి చెందిన భాగ్యలక్ష్మి నుండి కిడ్నీ తీసుకోవడానికి ఆమె తో ఆర్ధిక పరమైన ఒక లావాదేవికి బాలాజీ అంగీకారం కుదుర్చుకున్నాడు.
అయితే ఆ కిడ్నీ మార్పిడి జరిగాక మాత్రం, భాగ్యలక్ష్మికి ముందుగా మాట ఇచ్చిన ప్రకారం ఎటువంటి చెల్లింపులు సరైన పద్దతిలో చెల్లించలేదు అని ఆమె పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీనిని క్షుణ్ణంగా పరిశీలించి, న్యాయ సలహాలు తీసుకున్నాక బాలాజీ పైన 420 కేసు నమోదు చేశారు.
అయితే ఈ కిడ్నీ మార్పిడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో జరిగినందు వల్ల కేసు అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు పోలీసులు.