మహర్షి టాక్, నెగిటీవ్ ట్రోలింగ్ చూస్తే... రెండో రోజు నాటికి వసూళ్లు బాగా పడిపోయే అవకాశం ఉందనిపించింది. కానీ.. అదేం జరగలేదు. రెండో రోజు మహర్షి కలక్షన్లు స్టడీగానే ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఈ చిత్రం రెండో రోజు దాదాపు 8 కోట్లు తెచ్చుకుంది. తొలి రోజు 24.6 కోట్లు సాధించిన సంగతి తెలిసిందే. మొత్తానికి రెండు రోజులకు కలిసి 31.5 కోట్ల షేర్ సాధించింది.
నైజాంలో తొలి రోజు రూ.6.38 కోట్లు తెచ్చుకుంటే... రెండో రోజుకి అది 9.67కి చేరింది. 3.29 కోట్లు తెచ్చుకుందన్నమాట. నైజంలో ఓ సినిమా రెండో రోజు ఈ స్థాయిలో వసూళ్లు తెచ్చుకోవడం విశేషమే. సీడెడ్‌లో రెండో రోజు రూ.1 కోటి వసూళ్లు వచ్చాయి. ఈస్ట్, వెస్ట్, కృష్ణా, నెల్లూరులలో కూడా వసూళ్లు స్టడీగానే ఉన్నాయి. తొలి వారంతంలో ఈ సినిమా రూ.50 కోట్ల షేర్ తెచ్చుకోవడం ఖాయంగా అనిపిస్తోంది.
ఎందుకంటే ఓవర్సీస్ లెక్కలు కూడా కలుపుకుంటే.. రూ.50 కోట్ల మైలు రాయిని అందుకోవడం అంత కష్టమేం కాదు. కాకపోతే ఈ చిత్రానికి వంద కోట్ల షేర్ వస్తే గానీ.. బయ్యర్లు బయటపడరు. అదే జరగాలంటే ఈ హోరు.. మరో పది రోజులైనా కొనసాగాల్సిందే.