తేజూ పండ‌గ చేసుకునేది ఎవ‌రితో..?

By iQlikMovies - June 10, 2019 - 16:00 PM IST

మరిన్ని వార్తలు

ప్ర‌స్తుతం క‌థానాయిక‌ల వేట‌లో ఉన్నాడు సాయిధ‌ర‌మ్ తేజ్‌. త‌న కొత్త సినిమా `ప్ర‌తి రోజూ పండ‌గే` చిత్రంలో క‌థానాయిక కోసం కొన్ని రోజులుగా ఆన్వేష‌ణ సాగుతోంది. ఇప్పుడు అది ఓ కొలిక్కి వచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఫైన‌ల్ లిస్టులో రెండు పేర్లు ఫిక్స‌య్యాయి. ఆ ఇద్ద‌రి నుంచి ఒక‌రిని ఎంచుకోవ‌డ‌మే త‌రువాయి. గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

 

ఈ నెలాఖరు నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలెడతారు. ఈ సినిమా కోసం నిధి అగర్వాల్‌, రుక్సార్‌ థిల్లాన్ పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. ఇద్ద‌రిలో ఒక‌రిని క‌థానాయిక‌గా ఖాయం చేయాల్సివుంది. ‘సవ్యసాచి’, ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రాల్లో నాయికగా కనిపించింది నిధి. ఇప్పుడు ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లోనూ నటిస్తోంది. ‘ఏబీసీడీ’లో మెరిసింది రుక్సార్‌. మరి వీరిలో ఆ ఛాన్స్‌ ఎవరికొస్తుందో చూడాలి. 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS