'మహర్షి' కౌంట్‌డౌన్‌ స్టార్ట్స్‌!

మరిన్ని వార్తలు

మరి కొద్ది రోజుల్లోనే 'మహర్షి' ధియేటర్స్‌లో సందడి చేయనుంది. ఈ సందర్భంగా విసృతంగా ఈ సినిమాకి ప్రమోషన్స్‌ నిర్వహిస్తున్నారు. గతంలో మహేష్‌ సినిమాలకు ఎన్నడూ లేనంత పబ్లిసిటీని 'మహర్షి' విషయంలో చేస్తున్నారు. స్వయంగా మహేష్‌బాబు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. యాక్టివ్‌గా కనిపిస్తూ, ఆశక్తికరమైన సమాధానాలిస్తున్నారు.

 

అందులో భాగంగా ఇటీవల మహేష్‌బాబు హాలీవుడ్‌ ఎంట్రీ గురించి జరిగిన ప్రచారానికి సంబంధించి మహేష్‌ స్పందించారు. హాలీవుడ్‌ ప్రముఖ నటుడు బిల్‌ డ్యూక్‌ అంతటోడు మహేష్‌తో కలిసి సినిమా చేయాలని, న్యూయార్క్‌ వస్తే, తనతో కలిసి లంచ్‌ చేయాలని మహేష్‌ని ఆహ్వానించిన సంగతి తెలిసిందే ట్విట్టర్‌ ద్వారా. అయితే ఈ ట్వీట్‌కి మన టాలీవుడ్‌ జేమ్స్‌బాండ్‌ ఏమని సమాధానమిచ్చారో తెలుసా? డ్యూక్‌ ఖాళీగా ఉన్నాడేమో అందుకే ఇలాంటి ట్వీట్లు వేస్తున్నాడు.

 

అయినా నా మొదటి ప్రిఫరెన్స్‌ తెలుగు, తమిళ సినిమాల్లో పట్టు సాధించడమే. ఆ తర్వాతే హాలీవుడ్‌ అని కాస్త వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. అవును ఇదీ నిజమే అనుకోండి. అయితే, ఇదే విషయాన్ని మహేష్‌ ఇంకోలా చెప్పి ఉండాల్సింది. ఏది ఏమైతేనేమి సూపర్‌స్టార్‌ కదా. ఆయన ఎలా చెబితే అలాగే. ఇకపోతే మహేష్‌ నటించిన 'మహర్షి' తొలి ఆడియో సింగిల్‌గా విడుదలైన 'చోటీ చోటీ బాతే..' సాంగ్‌ వీడియో ప్రోమోని ఈ రోజు విడుదల చేయనున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నమోదు చేసిన 'మహర్షి' ఈ సాంగ్‌ ప్రోమోతో నెక్ట్స్‌ లెవల్‌కి చేరుతుందేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS