మ‌ళ్లీ సెంచ‌రీ కొట్టిన మ‌హేష్‌

By Gowthami - August 16, 2019 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

ఈ రోజుల్లో అన్నీ మూడు రోజుల సినిమాలే. తొలి మూడు రోజులూ సినిమా ఎంత చేసింది? అనేదాన్ని బ‌ట్టే హిట్లూ, ఫ్లాపులూ నిర్ణ‌య‌మ‌వుతున్నాయి. ఓ సినిమా వంద రోజులు ఆడ‌డం గ‌గ‌నం అయిపోతోంది. అయితే మ‌హేష్ బాబు ఈ ఫీట్‌ని మ‌ళ్లీ సాధించాడు. త‌న మ‌హ‌ర్షి సినిమా 3 సెంట‌ర్ల‌లో వంద రోజుల్ని పూర్తి చేసుకుంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది.mపూజా హెగ్డే క‌థానాయిక‌. న‌రేష్ కీల‌క పాత్ర వ‌హించారు.

 

శుక్ర‌వారంతో ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకుంది. గాజువాక (శ్రీ‌క‌న్య‌), చిల‌క‌లూరి పేట (రామ‌కృష్ణ‌), ఆధోనీ (ప్ర‌భాక‌ర్‌) థియేట‌ర్ల‌లో మ‌హ‌ర్షి శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకుంది. గాజువాక‌లో ఈ రోజు మ‌హ‌ర్షి వంద రోజుల వేడుక‌ని వైభ‌వంగా చేయ‌డానికి మ‌హేష్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు కూడా. మ‌హేష్ కొత్త సినిమా `స‌రిలేరు నీకెవ్వ‌రు` ఈ సంక్రాంతికి విడుద‌ల అవుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS