మరికొద్ది గంటల్లో మహర్షి హంగామా మొదలుకాబోతోంది. ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని మహేష్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బిజినెస్ పరంగా మహర్షి కొత్త రికార్డులు సాధించింది. మహేష్ గత రికార్డులన్నీ బిజినెస్ పరంగా బద్దలు కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 94 కోట్లకు థియేటరికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. నైజాంలో 22 కోట్లకు ఈ సినిమాని అమ్మేశారు. సీడెడ్‌లో 12 కోట్లు పలికింది.
ఉత్తరాంధ్ర రైట్స్ 9 కోట్లకు కొన్నారు. గుంటూరు 7.7 కోట్లు, తూర్పు గోదావరి 6.8 కోట్లు, వెస్ట్ గోదావరి 5.7 కోట్లకు బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ ధర దాదాపు 13 కోట్లకు చేరింది. ఇలా ఏ ఏరియా చూసుకున్నా మహేష్ గత రికార్డుల్ని తిరగరాసే ధరే పలికింది. అయితే నైజాం, ఉత్తరాంధ్ర, కృష్ణా జిల్లాలలో నిర్మాతలు ఈ సినిమాని సొంతంగా విడుదల చేసుకుంటున్నారు. తొలి రోజు దాదాపు 30 కోట్ల వసూళ్లు సాధించడం ఖాయమని నిర్మాతలు నమ్ముతున్నారు. ఇప్పటికే గురువారం టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేట్లు పెంచడం వల్ల రూ.30 కోట్ల టార్గెట్ సులభంగా దక్కించుకోవచ్చని నిర్మాతల నమ్మకం.