'మహర్షి' ఆస్ట్రేలియాలో రికార్డు సృష్టించబోతోంది షోస్ సంఖ్య పరంగా. సౌత్ స్టార్ ఇంటర్నేషనల్ అస్ట్రేలియాలోనూ, న్యూజిలాండ్‌లోనూ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. 15వ తేదీ వరకూ షోస్ ప్రదర్శించే ధియేటర్లు కన్‌ఫామ్ అయిపోయాయి. అన్నిచోట్లా అడ్వాన్స్ బుకింగులు స్టార్ట్ అయ్యాయ్. గ్యారంటీగా ఓపెనింగ్ డే రికార్డు ఆస్ట్రేలియాలో నెలకొల్పుతామని ఆస్ట్రేలియాలోని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు.
ఇక అమెరికా సంగతి చెప్పనే అక్కర్లేదు. ఓవర్సీస్‌కి కింగ్ మహేష్. అమెరికాలో రికార్డు స్థాయిలో ప్రీమియర్స్‌కి రంగం సిద్ధమైపోయింది. మహేష్‌కి ఓవర్సీస్ చాలా స్ట్రాంగ్ బేస్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అంతటా మహేష్ మేనియా నడుస్తోంది. హీరోయిన్‌గా నటిస్తోన్న పూజా హెగ్దే విసృతంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది.
'మహర్షి'తో పాటు, ఆమె నటించే ఇతర చిత్రాల సంగతులు కూడా ప్యాన్స్‌తో పంచుకుంటోంది. మరోవైపు సూపర్‌స్టార్ మహేష్ కూడా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఆశక్తికరమైన విషయాల్ని ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీ బ్యానర్‌తో కలిసి ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా రూపొందించారు. అల్లరి నరేష్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.