మెట్గలా ఈవెంట్లో భాగంగా తాజాగా ప్రియాంకా చోప్రా ఓ డిఫరెంట్ లుక్‌లో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ లుక్ వైరల్ అయ్యింది. పోజిటివ్ వైరల్ కాదది. చాలా నెగిటివ్‌గా ప్రియాంకాని ట్రోలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె హెయిర్ స్టైల్‌కే ఎక్కువ కామెంట్లు విసురుతున్నారు నెటిజన్లు. ప్రియాంకా ఫేస్‌ని రకరకాల ఫేస్‌లతో మార్ఫింగ్ చేసి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదే ఈవెంట్‌కి హాజరైన పలువురు ముద్దుగుమ్మలు ఎంతో చక్కగా ముద్దుగా మేకప్ చేసుకుని వస్తే, ప్రియాంకా మాత్రం సమ్‌థింగ్ డిఫరెంట్ అనుకుందో ఏమో, ఇంతకు ముందెన్నడూ లేని విధంగా మేకప్ చేసుకుని వచ్చింది.
అందుకేనేమో ఈ సెటైర్లు. మొత్తానికి అబాసు పాలైపోతోంది ప్రియాంకా తాజా లుక్. ఇక మన కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ కూడా ప్రియాంకాని వదిలి పెట్టలేదు. ఎప్పుడూ హీరోల మీదే ఎక్కువగా సెటైర్లు వేసే రామ్‌గోపాల్ వర్మ ఈ సారి ప్రియాంకా లుక్‌పై సెటైర్ వేశారు. ఆయన సినిమాలోని వీరప్పన్ గెటప్‌లో ప్రియాంకా లుక్ మిక్స్ చేసి ఓ ఫోటో పోస్ట్ చేశారు. ఆయన సినిమాలో నటించిన వీరప్పన్ క్యారెక్టర్‌కి దుడ్డు మీసం, గెడ్డం ఉన్న సంగతి తెలిసిందే.
ఆ గెడ్డాలు, మీసాల్లో ప్రియాంకా జుట్టును మిక్స్ చేసి ఈ ఫోటోని సరికొత్తగా డిజైన్ చేశారు రామ్‌గోపాల్ వర్మ. తన క్రియేటివిటీకి సంబంధించిన వివరణను మరి కాస్సేపట్లో ఇస్తాను, స్టే ట్యూన్డ్.. అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ పోస్ట్ చేశారు. ఇలా ఒక్కరేమిటీ.. సోషల్ మీడియా నిండా ప్రియాంకా లుక్‌పై మీమ్స్‌తో నిండిపోయింది.