ఏ పెద్ద హీరో సినిమా అయినా సరే, విడుదలైన తరవాత ఏదో రూపంలో వివాదం ముంచుకురావడం సహజంగా మారిపోయింది. మహర్షి సినిమాకీ అదే జరుగుతోంది. ఈ సినిమా కథ వంశీ పైడిపల్లి అందించారు. కానీ బేసిక్ ఐడియా మాత్రం మరో దర్శకుడిదట. లక్ష్యం, సాక్ష్యం లాంటి సినిమాలు తీసిన శ్రీవాస్.. అప్పుడెప్పుడో దిల్‌రాజుని కలిసి ఓ ఐడియా చెప్పార్ట.
ఆ కథ, `మహర్షి` కథ ఇంచుమించు ఒకేలా ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయమై దర్శకుడు శ్రీవాస్... దిల్‌రాజు కూర్చుని మాట్లాడుకున్నారని, అందుకే... గప్‌చుప్‌గా పంచాయితీ సద్దుమణిగిందని తెలుస్తోంది. వంశీ పైడిపల్లి కి కాపీ కొట్టే ఆలోచన లేకపోయినా.. ఇద్దరి థాట్స్ దాదాపు ఒకేలా ఉండడంతో.. దిల్‌రాజు ఈ వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించారని, ఐడియాలు దగ్గరగా ఉండడం వల్ల.. శ్రీవాస్‌కి నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
శ్రీవాస్‌కి తన బ్యానర్‌లో ఓ ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారని, ఆ విధంగా శ్రీవాస్‌కి తగిన న్యాయం చేయాలనుకుంటున్నార్ట. ఇదంతా పుకారేనా, లేదంటే ఇందులో ఏమైనా నిజం ఉందా? అనేది తెలియాలంటే శ్రీవాస్ నోరు విప్పాల్సిందే