'తుపాకీ' స్టైల్‌లో మ‌హేష్ సినిమా..?

By Gowthami - April 23, 2019 - 13:30 PM IST

మరిన్ని వార్తలు

మ‌హేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. 'మ‌హ‌ర్షి' త‌ర‌వాత సెట్స్‌పైకి వెళ్లే మ‌హేష్‌ సినిమా ఇదే. ఇప్ప‌టికే స్క్రిప్టు పూర్తి స్థాయిలో సిద్ధ‌మైంది. ఇక క్లాప్ కొట్ట‌డ‌మే త‌రువాయి. ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు లీక్ అవుతున్నాయి.

 

క‌థా ప‌రంగా చూస్తే... మురుగ‌దాస్ 'తుపాకీ' స్టైల్‌లో ఉండ‌బోతోంద‌ట‌. తుపాకీ గుర్తుంది క‌దా? మిల‌ట‌రీ ఆఫీస‌ర్ సెల‌వ‌ల కోసం ఇంటికి వ‌స్తాడు. ఇక్క‌డ ఆఫ్ డ్యూటీలో.. త‌ను ఓ ఆప‌రేష‌న్ మొద‌లెడ‌తాడు. దాని చుట్టూ 'తుపాకీ' క‌థ న‌డుస్తుంది. మ‌హేష్‌ సినిమా కూడా అంతేన‌ట‌. 

 

సెల‌వ‌ల కోసం ఇంటికి వ‌చ్చిన ఓ ఆర్మీ ఆఫీస‌ర్ ఇది. ఇక్క‌డ తాను చేప‌ట్టే ఆప‌రేష‌న్ నేప‌థ్యంలో ఈ సినిమా సాగ‌బోతోంది. కాక‌పోతే... మురుగ‌దాస్ సినిమా సీరియ‌స్ ఎమోష‌న్ చుట్టూ న‌డిస్తే - అనిల్ రావిపూడి దాన్ని కామెడీ చేస్తాడు. అంతే తేడా. మ‌రి ఈ సినిమా తుపాకీ స్థాయిలో హిట్ అవుతుందో లేదో తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS