సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చి, మంచి విజయం దక్కించుకున్న 'ఎఫ్ 2' చిత్రం బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌తో కలిసి, టాలీవుడ్ సక్సెస్ఫుల్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయనున్నారు. వెంకటేష్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో నటించబోయే బాలీవుడ్ తారాగణమెవరో ఇంకా తెలీదు కానీ, మెహ్రీన్ పాత్రలో మాత్రం మెహ్రీన్నే తీసుకోవాలని అనుకుంటున్నారట.
ఆల్రెడీ మెహ్రీన్ బాలీవుడ్‌కి సుపరిచితురాలే. 'ఫిల్లోరీ' తదితర సినిమాల్లో నటించింది గతంలో. అనుష్కా శర్మ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా మెహ్రీన్‌కి మంచి పేరే తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలతో మెహ్రీన్ బిజీ అయిపోయిన కారణంగా మళ్లీ బాలీవుడ్ వైపు తొంగి చూడలేదు. అయితే ఇప్పుడు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అరదించిన 'ఎఫ్ 2' రీమేక్‌తో మరోసారి బాలీవుడ్కెళ్లబోతోందన్న మాట.
బబ్లీ గాళ్‌గా 'హనీ ఈజ్ ద బెస్ట్' అంటూ అల్లరి చేష్టలతో ఆకట్టుకున్న 'హనీ' పాత్రలో మెహ్రీన్ తప్ప మరో భామను ఊహించుకోవడం కష్టమంటున్నారట దిల్‌రాజు. సో దిల్‌రాజు సూచనతో ఆ పాత్రకు మళ్లీ మెహ్రీన్నే ఎంచుకోవాలనుకుంటున్నారట. ఇక వెంకీ, వరుణ్, తమన్నా పాత్రల్లో నటించేందుకు బాలీవుడ్లో పలువురు అగ్ర నటీనటులు రేస్‌లో ఉన్నారు. చూడాలి మరి తెలుగు 'ఎఫ్ 2' బ్లాక్ బస్టర్ కొట్టినట్లుగా, హిందీ 'ఎఫ్ 2' కూడా బ్లాక్ బస్టర్ అయ్యిందంటే మెహ్రీన్ దశ తిరిగినట్లే.