నాగ్‌, రకుల్‌ ఇద్దరూ ఇద్దరే!

మరిన్ని వార్తలు

నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న 'మన్మధుడు 2' చిత్రంపై కొద్ది కొద్దిగా అంచనాలు రెట్టింపవుతున్నాయి. మొన్న విడుదలైన ఫస్ట్‌ టీజర్‌తోనే ఈ సినిమా అంచనాల్ని నమోదు చేసింది. ఇక రీసెంట్‌గా విడుదలైన 'అవంతికా' టీజర్‌ సరికొత్త అంచనాల్ని క్రియేట్‌ చేసింది. రకుల్‌ క్యారెక్టర్‌ హద్దులు దాటేసినట్లు కనిపించినా, కథలో సిట్యువేషన్‌ బట్టి ఆమె పాత్రను అలా డిజైన్‌ చేయాల్సి వచ్చిందట డైరెక్టర్‌కి.

 

మొత్తానికి అవంతికగా రకుల్‌ ప్రీత్‌ చేస్తున్న హల్‌చల్‌ అంతా ఇంతా కాదు. నాగార్జునను ఇంట్రడ్యూస్‌ చేస్తూ విడుదల చేసిన మొదటి టీజర్‌లో కూడా నాగ్‌ని ఫస్ట్‌ బుద్ధిమంతుడిలా చూపించి, తర్వాత ఆయన రొమాంటిక్‌ విశ్వరూపం రివీల్‌ చేశారు టీజర్‌లో. అలాగే, రకుల్‌ టీజర్‌నీ అదే ప్యాటర్న్‌లో కట్‌ చేశారు. ఫస్ట్‌ 'యూ' సర్టిఫికెట్‌ పద్ధతిలో అవంతికగా రకుల్‌ని చూపించి, తర్వాత 'ఎ' సర్టిఫికెట్‌ అమ్మాయిగా మార్చేశారు. మొత్తానికి రకుల్‌కి ఈ సినిమాలో ప్రాధాన్యత బాగానే దక్కినట్లు తెలుస్తోంది. నాగ్‌కి సమానమైన ఇంపార్టెన్స్‌ ఇచ్చి, ఇంపార్టెన్స్‌ ఏంటీ.? కూసింత ఎక్కువ బిల్డప్పే ఇచ్చి స్పెషల్‌గా రకుల్‌పై టీజర్‌ రిలీజ్‌ చేయడం విశేషమే.

 

ఇక ఈ సినిమాలో మరో భామ కీర్తిసురేష్‌ గెస్ట్‌ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'నేను రెండేళ్లుగా ఒకమ్మాయిని లవ్‌ చేస్తున్నా..' అంటూ నాగ్‌ చేత టీజర్‌లో డైలాగ్‌ చెప్పించారు. ఆ డైలాగ్‌లో ఉన్న అమ్మాయి కీర్తిసురేష్‌ కాబోలు. ఆల్రెడీ కీర్తిసురేష్‌, నాగ్‌ కాంబినేషన్‌లో ఓ స్టిల్‌ రిలీజ్‌ అయ్యింది. అది కాక, ఒకవేళ కీర్తి క్యారెక్టర్‌ పరిచయం కూడా టీజర్‌ రూపంలో చేస్తారేమో చూడాలిక. అన్నట్లు అక్కినేని సమంతకూ ఈ సినిమాలో ఓ బెస్ట్‌ గెస్ట్‌ రోల్‌ ఉంది. అదేంటో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే. నటుడు, కమ్‌ డైరెక్టర్‌ రాహుల్‌ రవీంద్రన్‌ ఈ సినిమాకి దర్శకుడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS