'ఆర్‌.ఐ.ఎస్‌..' నెక్స్ట్‌ ఏంటీ.?

By iQlikMovies - August 06, 2018 - 15:45 PM IST

మరిన్ని వార్తలు

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ఫస్ట్‌లుక్‌ని ఆగస్టు 9న విడుదల చేయనున్నారు. ఆ రోజు మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల చేయబోతున్నామని చిత్ర యూనిట్‌ తాజాగా ప్రకటించింది. ఈ సినిమాలో మహేష్‌బాబు గెడ్డం, మీసంతో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

ఫస్ట్‌లుక్‌ వస్తే, మహేష్‌ గెటప్‌ ఏంటనేది స్పష్టంగా రివీల్‌ అవుతుంది. కాగా, ఇటీవల 'ఆర్‌', 'ఐ', 'ఎస్‌' అంటూ ఈ సినిమాకి సంబధించి కొన్ని లెటర్స్‌ని రిలీజ్‌ చేశారు. ఈ లెటర్స్‌ టైటిల్‌కి సంబంధించినవి అని తెలుస్తోంది. ఈ లెటర్స్‌ని బట్టి కొంతమంది సినిమా పేరు 'రిషి' అయ్యుండొచ్చని అంటున్నారు. ఇంకొంత మంది తమకి తోచిన పదాల్ని మహేష్‌ కొత్త సినిమా టైటిల్‌గా మార్చి డిజైన్స్‌ చేసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. 

ఇవన్నీ కాదు కానీ, ఇంకో లెటర్‌ వస్తే, పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. మరి ఎప్పుడెప్పుడు ఆ లెటర్‌ వచ్చేదా? అని అభిమానులు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో, అశ్వనీదత్‌తో కలిసి, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. హాట్‌ బ్యూటీ పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోందీ చిత్రం. 

'భరత్‌ అనే నేను' సక్సెస్‌తో ఈ సినిమాపై మొదట్నుంచీ భారీ అంచనాలున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS