'శ్రీనివాస కళ్యాణం' పెళ్లి కానుక

By iQlikMovies - August 06, 2018 - 15:03 PM IST

మరిన్ని వార్తలు

సినిమా నిర్మాణం ఓ ఎత్తు. ఆ సినిమాని విడుదల చేసేందుకు చేసే పబ్లిసిటీ మరో ఎత్తు. తాజాగా నితిన్‌ - రాశీఖన్నా జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'శ్రీనివాస కళ్యాణం'కి సంబంధించి ప్రమోషన్‌ కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తునే కాదు, వినూత్నంగా నిర్వహిస్తున్నారు. 

మొన్నా మధ్య జరిగిన 'శ్రీనివాస కళ్యాణం' ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌కి విచ్చేసిన అతిధులందరికీ దిల్‌రాజు పెళ్లి సారెగా బహుమతులు ఇచ్చి సత్కరించారు. అలాగే ఇప్పుడు కామన్‌ పీపుల్‌కి కూడా ఓ ఓపెన్‌ ఆఫర్‌ ఇస్తున్నాడు దిల్‌రాజు. ఈ బంపర్‌ ఆఫర్‌ త్వరలో అంటే శ్రావణ మాసంలో పెళ్లి చేసుకునే వారికి మాత్రమే. శ్రావణ మాసంలో పెళ్లి చేసుకునే వధూవరులు తమ శుభలేఖల్ని 'శ్రీనివాస కళ్యాణం' యూనిట్‌కి పంపిస్తే వారందరికీ పట్టు బట్టలు పెడతారట. అందులో కొంతమందిని ఎంపిక చేసి సినిమా టీమ్‌తో కలిసి కాస్సేపు గడిపే అద్భుతమైన ఛాన్స్‌ కూడా ఉందట. 

మరింకేం ఈ శ్రావణ మాసంలో ఒక్కటి కాబోయే నూతన వధూ వరులు శ్రీనివాస కళ్యాణం టీమ్‌ అందించే ఈ బహుమతులకు సిద్ధమైపోండిక. దిల్‌ రాజు నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, పోస్టర్స్‌ పెళ్లి ఫ్లేవర్‌తో ఆహ్లాదంగా ఎట్రాక్ట్‌ చేస్తున్నాయి.  

'శతమానంభవతి' సినిమాతో హిట్‌ కొట్టిన సతీష్‌ వేగేశ్న ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నందితా శ్వేతా కీలక పాత్ర పోషిస్తోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS