సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి చిరంజీవి అతిథిగా వెళ్లిన సంగతి తెలిసిందే. చిరుని గెస్ట్ గా తీసుకురావాలన్న ఆలోచన మహేష్బాబుదేనట. ఈ విషయాన్ని మహేష్ స్వయంగా చెప్పాడు. అంతేకాదు.. నాలుగైదు నెలల క్రితమే చిరుని ఈ ఫంక్షన్‌కి పిలవాలని ఫిక్సయ్యార్ట. ఈ విషయం గురించి మహేష్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. ''నాలుగైదు నెలలక్రితమే.. చిరంజీవిగారిని ప్రీ రిలీజ్‌కి ఆహ్వానించాలన్న నిర్ణయం తీసుకున్నాం. నేను చిరంజీవిగారికి మెసేజ్ చేశాను.
రెండో క్షణంలో ఆయన నుంచి 'నేను వస్తున్నా' అంటూ సమాధానం వచ్చింది. లేదు సార్.. నేను ఇంటికొచ్చి, మిమ్మల్ని ఆహ్వానిస్తాను' అన్నాను. కానీ ఆయన ఒప్పుకోలేదు. `నువ్వు ఇంటికి కూడా రావాల్సిన అవసరం లేదు. నేను వస్తున్నా అంతే` అంటూ ఆనందంగా ఒప్పుకున్నారు. ఆయన రాక మా అందరికీ ఆనందాన్ని ఇచ్చింది. మా టీమ్ ఎప్పటికీ చిరంజీవిగారిని గుర్తు పెట్టుకుంటుంది'' అంటూ చిరు రాకపై తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు మహేష్.