'భరత్ అనే నేను' సినిమా తర్వాత మహేష్ చేయాల్సింది నిజానికి సుకుమార్‌తో సినిమానే. కానీ అనూహ్యంగా వంశీ పైడిపల్లి లైన్‌లోకి వచ్చాడు. 'మహర్షి' పూర్తయ్యాక సుకుమార్‌తో ఖచ్చితంగా మహేష్ సినిమా ఉంటుందనుకున్నారంతా. కానీ అదీ కుదరలేదు. 'ఎఫ్ 2'తో హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆ ప్లేస్‌ని ఆక్యుపై చేసేశాడు. దాంతో సుకుమార్‌కీ, మహేష్‌కీ మధ్య ఏవో గొడవలున్నాయనీ, అందుకే సుకుమార్‌ని మహేష్ లైట్ తీసుకుంటున్నాడనీ, ఇక ఇప్పట్లో సుకుమార్‌తో మహేష్ సినిమా ఉండదనీ ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఈ ప్రచారాలపై మహేష్ స్పందించాడు. సుకుమార్‌తో తనకు ఎలాంటి గొడవలూ లేవనీ, సుకుమార్‌తో తాను నటించిన 'వన్ - నేనొక్కడినే' హిట్ కాకున్నా తన కెరీర్‌లో అదో స్పెషల్ మూవీ అనీ, నటుడిగా ఎంతో సంతృప్లినిచ్చిన సినిమా 'వన్ - నేనొక్కడినే' అని మహేష్ చెప్పుకొచ్చారు. అయితే 'మహర్షి' ప్రీ రిలీజ్ వేదికపై మహేష్‌బాబు సుకుమార్ పేరు, పూరీ జగన్నాధ్ పేరుతో పాటు మరికొందరు తన కెరీర్‌లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన డైరెక్టర్స్‌ని తలవడం మర్చిపోయారు. అందుకు కారణం చెబుతూ ఆ రోజు పరిస్థితి అలాంటిది. చెప్పలేకపోయాను. అందుకు ప్రత్యేకమైన కారణాలేమీ లేవు. ఆయా డైరెక్టర్లు తన కెరీర్‌లో ఎప్పటికీ ప్రత్యేకమే.
సుకుమార్‌తో సినిమా ఖచ్చితంగా చేస్తాను. అలాగే రాజమౌళితో కూడా ఓ సినిమా చేయాలి అని మహేష్ తన మనసులోని మాటల్ని అభిమానులతో పంచుకున్నారు. మహేష్ నటించిన 'మహర్షి' ప్రమోషన్స్ జోరందుకున్నాయి. అందులో భాగంగానే పై విధంగా మహేష్ తన అభిప్రాయాల్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు.