మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్ హీరోగా ఆల్రెడీ ప్రూవ్ చేసేసుకున్నాడు. ఇక ఇప్పుడు తేజు తమ్ముడి వంతొచ్చింది. తేజు సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమాని ఇటీవల గ్రాండ్‌గా లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సక్సెస్ఫుల్ బ్యానర్ అయిన మైత్రీ మూవీస్ బ్యానర్లో ఈ సినిమా రూపొందుతోంది. సినిమా లాంఛింగ్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ దృష్ట్యా ఈ సినిమాకి 'జాలరి' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ఆల్రెడీ చిత్రయూనిట్ ఇదే టైటిల్‌ని రిజిస్టర్ చేసిందట కూడా. దాంతో ఈ సినిమాకి టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. అయితే తాజాగా ఇంకో టైటిల్ తెరపైకి వచ్చింది. అదే 'ఉప్పెన' అనే టైటిల్ అట. కథా నేపథ్యానికి తగ్గట్టుగా 'ఉప్పెన' అనే టైటిల్ యాప్ట్ అవుతుందని చిత్ర యూనిట్ ఇంకో ఆలోచన చేస్తున్నారట. ఈ రెండూ కాక ఇంకో టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి ఈ సినిమాకి మూడు టైటిళ్లు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ఏది ఫైనల్ చేస్తారో త్వరలోనే తెలియనుంది. హీరో మత్య్సకారుడి పాత్ర పోషిస్తున్నాడు. కానీ స్టోరీ పరువు హత్యల నేపథ్యంలో ఉండబోతోందనీ తెలుస్తోంది. హీరోయిన్గా దేవికా సంజయ్, మేఘనా రాజ్ అనే ఇద్దరు ముద్దుగుమ్మల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిలో ఎవరి పేరు ఫైనల్ అవుతుందో వేచి చూడాలిక.