మహేష్‌బాబు 'ఎఎంబి సూపర్‌ ప్లెక్స్‌' అదిరింది.!

మరిన్ని వార్తలు

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు.. సినిమా థియేటర్ల బిజినెస్‌లోకి దిగాడు. 'ఎఎంబి సూపర్‌ ప్లెక్స్‌'తో మల్టీప్లెక్స్‌ రంగంలో సరికొత్త సంచలనానికి నాంది పలికాడు మహేష్‌బాబు. ఏసియన్‌ సంస్థతో కలిసి మహేష్‌బాబు స్థాపించిన 'ఎఎంబి సూపర్‌ ప్లెక్స్‌' రేపు ప్రారంభం కాబోతోంది. ఇదిప్పుడు తెలుగునాట సంచలన వార్తగా మారింది. ఈ సూపర్‌ ప్లెక్స్‌ నిర్మితమై, ప్రారంభానికి ఎప్పుడో సిద్ధమయినా.. కొన్ని కారణాలతో ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వచ్చింది.

తాజాగా, డేట్‌ ఫిక్స్‌ అయ్యింది. మరోపక్క, ఇప్పటికే ఈ సూపర్‌ ప్లెక్స్‌ని చూసిన పలువురు సినీ ప్రముఖులు, ఇంతవరకు ఇలాంటి అద్భుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా చూడలేదంటున్నారు. వరల్డ్‌ క్లాస్‌ యాంబియన్స్‌తో ఈ 'ఎఎంబి సినిమాస్‌' రూపొందిందనే అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అయితే, మహేష్‌బాబు అంత అందంగా ఈ సూపర్‌ ప్లెక్స్‌ వుందంటూ సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశాడు.

ఆయన నిన్ననే ఈ సూపర్‌ ప్లెక్స్‌కి వెళ్ళి వచ్చాడట. ఫైవ్‌ స్టార్‌ యాంబియన్స్‌ ఈ సూపర్‌ ప్లెక్స్‌ ప్రత్యేకత అట. 7 స్క్రీన్లు, సుమారు 1638 మంది ప్రేక్షకుల కోసం సిద్ధంగా వున్నాయి. పిక్చర్‌, సౌండ్‌ క్లారిటీ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సూపర్‌ ప్లెక్స్‌లో వినియోగించారు. ఇప్పటిదాకా మల్టీప్లెక్స్‌ల గురించే మనం వింటూ వచ్చాం. ఇది, సూపర్‌ ప్లెక్స్‌. అవును మరి, సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుకి చెందిన మల్టీప్లెక్స్‌ ఇది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS