'ఖైదీ' ద‌ర్శ‌కుడితో మ‌హేష్?

By Gowthami - August 05, 2020 - 12:19 PM IST

మరిన్ని వార్తలు

ఖైదీ సినిమాతో ఇటు తెలుగు, అటు త‌మిళ చిత్ర‌సీమ‌ల్ని ఆక‌ర్షించిన ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్‌. ఇప్పుడు విజ‌య్ తో `మాస్ట‌ర్‌` తీశాడు. ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈలోగా... లోకేష్‌కి తెలుగు నుంచి బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే మైత్రీ మూవీస్ లో ఓ సినిమా చేయ‌బోతున్నాడు లోకేష్‌. హీరో ఎవ‌ర‌న్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌. అయితే ఆ హీరో మ‌హేష్ బాబు అయ్యే అవ‌కాశాలు ఎక్కువ ఉన్న‌ట్టు టాలీవుడ్ టాక్‌.


ఎందుకంటే.. మైత్రీ మూవీస్ లో మ‌హేష్ బాబు ఓ సినిమా చేయాలి. `శ్రీ‌మంతుడు` త‌ర‌వాత‌... మైత్రీతో మ‌రో సినిమా చేయ‌డానికి మ‌హేష్ ఒప్పుకున్నాడు. అయితే మ‌హేష్‌కి స‌రిప‌డ క‌థ లేక‌.. ఇంత‌కాలం ఆగారు. లోకేష్ ఇప్పుడు మ‌హేష్ కోస‌మే క‌థ రెడీ చేస్తున్న‌ట్టు టాక్‌. `మాస్ట‌ర్` పై ఇప్ప‌టికే మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఆ సినిమా హిట్ అయితే... మ‌హేష్ తో సినిమా చేసే అవ‌కాశాలు మ‌రింత ఎక్కువ అవుతాయి. మ‌హేష్ అయితే లోకేష్ ని హోల్ట్ లో ఉంచిన‌ట్టు టాక్‌. `మాస్ట‌ర్‌` హిట్ట‌యితే.. అప్పుడు లోకేష్ ని లైన్ లో పెట్టొచ్చ‌ని భావిస్తున్నాడ‌ట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS