మ‌హేష్ - అనిల్ రావిపూడి టైటిల్ ఇదేనా?

మరిన్ని వార్తలు

మ‌హేష్ బాబు ఫుల్ జోష్ మీదున్నాడు.మ‌హ‌ర్షి విజ‌యోత్సాహంతోనే త‌న కొత్త సినిమాని మొద‌లెట్టేందుకు రెడీ అయ్యాడు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమా కోసం `స‌రిలేరు నీకెవ్వ‌రూ` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఇప్పుడు మ‌రో టైటిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాకి `రెడ్డి గారి అబ్బాయి` అనే టైటిల్ ఫిక్స్ చేసే అవ‌కాశాలున్నాయ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల టాక్‌. ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది.

 

ఓ ఫ్యాక్ష‌నిస్టు కొడుకుగా మ‌హేష్ క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. అందుకే ఈ టైటిల్ అయితే బాగుంటుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారు. ఇటీవ‌లే ఈ టైటిల్ కూడా రిజిస్ట‌ర్ చేయించార‌ని స‌మాచారం అందుతోంది. టైటిల్ ఖ‌రారు చేసే బాధ్య‌త ఇప్పుడు మ‌హేష్ చేతుల్లో పెట్టేసింది చిత్ర‌బృందం. మ‌హేష్ ఏ టైటిల్‌కి ఓటేస్తే,... ఆ టైటిలే ఫైన‌ల్ అవుతుంది. మ‌రి మ‌హేష్ ఏమంటాడో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS