మహేష్ బాబు పారితోషికం ఎంతన్న విషయంలో టాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మహర్షి విజయంతో జోరుమీదున్నాడు మహేష్. ఆ వెంటనే అనిల్ రావిపూడి సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు రూ.50 కోట్ల పారితోషికం తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే టాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయకుల్లో మహేష్ అగ్రస్థానంలో నిలబడినట్టే.
అయితే.. మరో వర్గం మాత్రం రూ.50 కోట్ల పారితోషికం అనేది అబద్దం అంటోంది. మహేష్ పారితోషికం గా రూ.25 కోట్లు తీసుకుంటున్నాడని, ఈసారి లాభాలలో 30 శాతం వాటా కూడా అడుగుతున్నాడని, అవి రెండూ కలుపుకుంటే పారితోషికం 45 కోట్ల వరకూ ఉంటుందని చెబుతున్నారు. లాభాలు ఎంత వస్తాయన్నది విడుదల వరకూ తెలీదని, సినిమా విడుదలై, వసూళ్ల లెక్క తేలే వరకూ మహేష్ పారితోషికం ఇంతన్న విషయంలో స్పష్టత రాదని వాళ్లంటున్నారు. ఏ రకంగా చూసుకున్నా.. పారితోషికం విషయంలో మహేష్ కొత్త రికార్డులు బ్రేక్ చేసినట్టే.