మహేష్ లాంటి సూపర్ స్టార్‌కి యునానిమస్‌గా తొలిరోజే హిట్ టాక్ వస్తే, బాక్సాఫీస్ వసూళ్ళు ఎలా వుంటాయ్? అదిరిపోతాయ్. చాలా చోట్ల నాన్ బాహుబలి రికార్డులు తొలి రోజు గల్లంతయినట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఓవర్సీస్‌లో అయితే ప్రీమియర్స్ అదరగొట్టేలా వసూళ్ళను ఆర్జించినట్లు తెలుస్తోంది.
'శ్రీమంతుడు' తర్వాత మహేష్ నుంచి ఆ స్థాయి హిట్ రావడంతో అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దుగా కన్పిస్తోంది. ఫస్ట్ డే థియేటర్ల వద్ద ఎలాంటి సందడి కన్పించిందో, రెండో రోజూ అదే సందడి థియేటర్ల వద్ద కన్పిస్తోంది. బ్లాక్ మార్కెట్‌లో 'భరత్ అనే నేను' సినిమా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అదనపు షోలు వేస్తున్న దరిమిలా, అన్ని షోస్‌కీ హౌస్ ఫుల్ వసూళ్ళు వస్తున్నాయి. తద్వారా వసూళ్ళ ప్రభంజనమే కొనసాగుతోందక్కడ.
నైజాం, సీడెడ్ అన్న తేడాల్లేకుండా తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల నుంచీ వసూళ్ళ పరంగా అద్భుతమైన రిపోర్ట్స్ వస్తున్నట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సమ్మర్ సీజన్ కావడం, రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు 'భరత్ అనే నేను' సినిమాకి మరింత ఊతమిస్తాయని నిస్సందేహంగా చెప్పొచ్చు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు 'భరత్ అనే నేను' సినిమా చూసి స్పందిస్తున్న తీరు సింప్లీ సూపర్బ్.
సాధారణంగా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాలకు డివైడ్ టాక్ వుంటుంది. దానికి భిన్నంగా యునానిమస్‌గా 'భరత్' సూపర్ హిట్ టాక్ అందుకోవడాన్ని అద్భుతః అనడం అతిశయోక్తి కాదేమో.