సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటించిన 'భరత్ అనే నేను' తెలుగు రాష్ట్రాల్లో సంచలన వసూళ్లు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పుడు తమిళంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్. ఆల్రెడీ తమిళంలో తెలుగు వెర్షన్ ఇప్పటికే మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు తమిళ వెర్షన్‌లో మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.
'స్పైడర్' సినిమాతో తమిళంలో మహేష్‌బాబు సుపరిచితుడయ్యాడు. ఆ సినిమా అప్పుడు ఆశించిన ఫలితాన్ని అందివ్వకపోయినా, జనాలకు సుపరిచితుడయ్యాడు. దాంతో ఈ సినిమాపై అక్కడ కూడా భారీ అంచనాలు నమోదవుతున్నాయి. త్వరలోనే తమిళనాడులో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' చిత్రం సామాజిక అంశంతో కూడి, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించేలా కమర్షియల్ హంగులతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ముద్దుగుమ్మ కైరా అద్వానీ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇప్పుడు తమిళ వెర్షన్‌తో తమిళ తంబీలకు కూడా దగ్గర కానుంది. బాలీవుడ్ నుండి వచ్చిన కైరా అద్వానీ సౌత్‌లో బిజీ కావాలనే యోచనతో, భాషతో సంబంధం లేకుండా సౌత్ సినిమాలన్నింటి పైనా దృష్టి పెట్టాలనుకుంటోందట.
ఈ సంగతిటుంచితే, 'భరత్ అనే నేను' ఓవర్సీస్‌లోనూ ఇరగ దున్నేస్తోంది. రికార్డు వసూళ్లు కొల్లగొడుతోంది. తమిల వెర్షన్ రిలీజ్‌తో 'భరత్' వసూళ్లలో మరిన్ని రికార్డులు సృష్టించనుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.