ఏడాదికి మూడు సినిమాలతో మూడు పువ్వులు, ఆరు కాయల్లా వరుస సినిమాలతో పైసా వసూల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే రవితేజ, దాదాపు రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఈ ఏడాదే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. 'రాజా ది గ్రేట్' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి మాస్ రాజా ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. కానీ 'టచ్ చేసి చూడు'తో నిరాశ పరిచాడు.
థర్డ్ అటెంప్ట్‌గా ఇప్పుడు 'నేల టికెట్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకి విడుదలకు ముందే క్రేజ్ వచ్చేలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ని గ్రాండ్‌గా నిర్వహించాడు. దాంతో పవన్ ఫ్యాన్స్‌ని బుట్టలో పడేశాడు రవితేజ. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కళ్యాణ్‌కి గత చిత్రాల బ్యాక్ గ్రౌండ్ సక్సెస్ మీదే ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు బాగున్నాయి. కొత్తమ్మాయి మాళవికా శర్మ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పనుంది.
అమ్మడి గ్లామర్ దాడి సినిమాలో ఓ రేంజ్‌లో ఉండనుందనడానికి జస్ట్ ఏ శాంపిల్ అన్నట్లుగా ఆడియో ఫంక్షన్‌లో సూపర్ హాట్ అప్పీల్ ఇచ్చేసింది. ఫ్రెష్ ఫ్రెష్ అందాలతో మాళవికా శర్మ అప్పియరెన్స్ ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఇక రవితేజ మాస్ అప్పీల్‌లో గత వైభవం చూపించబోతున్నాడనీ టాక్ వినిపిస్తోంది.
మరోవైపు రవితేజ నటిస్తున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. శీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆల్రెడీ ఈ ఏడాది రెండు సినిమాలతో పలకరించిన రవితేజ 'నేల టికెట్'తో ముచ్చటగా మూడోసారి ప్రేక్షకుల ముందుకొచ్చి సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఇదివరకటి తన హిస్టరీని రిపీట్ చేయనున్నాడన్నమాట.