మహేష్‌ నీకు 'సరిరారు...' అంతే!

మరిన్ని వార్తలు

పెద్ద సినిమాలకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పడం, చిన్న సినిమాల్ని అభినందిస్తుండడం వంటి కొత్త స్ట్రాటజీని బాగా ఫాలో చేస్తున్నారు ఈ మధ్య స్టార్‌ హీరోలు. ఆ క్రమంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ముందు ప్లేస్‌లో ఉన్నారనాలేమో. త్వరలో విడుదల కాబోతున్న రెండు చిన్న సినిమాలను ప్రశంసిస్తూ, సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ట్విట్టర్‌ ఖాతా ద్వారా విషెస్‌ చెప్పి, పెద్ద మనసు చాటుకున్నారు. ఒక రకంగా ఈ సినిమాలకు సూపర్‌ స్టార్‌ ద్వారా గట్టి ప్రమోషన్‌ లభించినట్లే అని చెప్పాలి.

 

రవిబాబు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆవిరి' సినిమా టీజర్‌ చూసి టీజర్‌ చాలా బాగుందనీ, హారర్‌ సినిమాల్లో రవిబాబు హారర్‌ సినిమా వేరయా.. అనేంతలా ఆయన ప్రశంసలు కురిపించారు. టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఇక మరో సినిమా 'ఊరంతా అనుకుంటున్నారు'. ఈ సినిమాలో సీనియర్‌ హీరో నరేష్‌ తనయుడు నవీన్‌ విజయ్‌ కృష్ణ హీరోగా నటిస్తున్నాడు. అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

 

మేఘా చౌదరి, సోఫియా సింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ చాలా కొత్తగా ఉందనీ, ట్రైలర్‌ చూస్తూ చాలా ఎంజాయ్‌ చేశాననీ, త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని టీమ్‌ మొత్తాన్ని అభినందిస్తూ, మహేష్‌బాబు ట్వీట్‌ చేశారు. ఈ సినిమాలో ఓ పాటను ముద్దుగుమ్మ రాశీఖన్నా ఆలపించిన సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS