అగ్రహీరోల బ్రాండ్ అండాస్మెంట్స్తో ఆయా ప్రొడక్ట్స్‌కి విపరీతమైన పాపులారిటీ దక్కుతుంది. టాలీవుడ్లో ఈ తరహా బ్రాండ్ అండాస్మెంట్స్కి పెట్టింది పేరు సూపర్ స్టార్ మహేష్‌బాబు. టాలీవుడ్లోనే కాదు, ఏకంగా సౌత్‌లోనే బ్రాండ్ అండాస్మెంట్స్లో మహేష్‌బాబే టాప్.
ఆ తర్వాతి ప్లేస్‌లో అల్లు అర్జున్ ఉంటాడు. నాగార్జున కళ్యాణ్ జ్యూయలర్స్కీ, వెంకటేష్ రామరాజు కాటన్ పంచెలకూ, ముత్తూట్ ఫైనాన్స్కీ బ్రాండ్ అంబాసిడర్స్‌గా వ్యవహరిస్తున్నారు. అయినా కానీ టోటల్‌గా సౌత్‌లో హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్‌గా ఈ ప్రకటనలకు సంబంధించి, మహేష్‌బాబు పేరే మొదటి ప్లేస్‌లో ఉంటుంది.
తాజాగా మహేష్‌బాబు ప్రోటీనెక్స్కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. ప్రకటనల విషయం పక్కన పెడితే, మహేష్‌బాబు ప్రస్తుతం 'భరత్ అనే నేను' సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మహేష్‌బాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారన్న సంగతి తెలిసిందే. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పొలిటికల్ పంచెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.
స్వతహాగా రచయిత అయిన కొరటాల శివ పోలిటిక్స్‌పై బాగా అబ్జర్వ్ చేసి ఈ సినిమాకి డైలాగ్స్ రాశారు. 'శ్రీమంతుడు' సినిమా వీరిద్దరి కాంబినేషన్లోనే వచ్చి సంచలన విజయం అందుకుంది. ఊరు నుండి ఎన్నో తెచ్చుకున్నాం. ఆ ఊరు కోసం ఏదో ఒకటి చేయాలి అంటూ 'ఊరు దత్తత' అనే సామాజిక కాన్సెప్ట్‌తో 'శ్రీమంతుడు' సినిమాను తెరకెక్కించిన కొరటాల శివ, 'భరత్ అనే నేను' సినిమాతో ఈ సారి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నాడో చూడాలి మరి.
ఈ సినిమాలో మహేష్‌కి జోడీగా బాలీవుడ్ భామ కైరా అద్వానీ నటిస్తోంది. సమ్మర్ కానుకగా ఈ సినిమా ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.