సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కన్నుమూశారు. లివర్ వ్యాధితో భాదపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రమేష్ బాబు మృతి చెందినట్టు వైద్యులు దృవీకరించారు.
రమేష్ బాబు నటుడు, నిర్మాత సినీ ప్రయాణం చేశారు. బాలనటుడిగా అల్లూరి సీతారామ రాజుతో సినీ రంగ ప్రవేశం చేశారు రమేష్ బాబు. తర్వాత సామ్రాట్, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు..పలు సినిమాల్లో కనిపించారు. నిర్మాతగా మహేష్ బాబుతో అర్జున్, అతిధి సినిమాలు నిర్మించారు. దూకుడు, ఆగడు సినిమాలకు సమర్పకులుగా వ్యవహరించారు. రమేష్ బాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.