మహేష్ బాబు చేతిలో `సర్కారు వారి పాట` వుంది. ఆ తరవాత.. రాజమౌళితో ఓ సినిమా చేయాలి. `ఆర్.ఆర్.ఆర్` తరవాత.. రాజమౌళి కూడా మహేష్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అయితే... `సర్కారు వారి పాట`కీ రాజమౌళి సినిమాకీ మధ్య మహేష్ మరో సినిమా చేయబోతున్నాడు. అయితే.. ఎలాంటి సినిమా? ఏ దర్శకుడితో? అనే విషయంలో తేల్చుకోలేకపోతున్నాడని టాక్.
`సర్కారు వారి పాట`కీ రాజమౌళి సినిమాకీ మధ్యన ఆరేడు నెలలు గ్యాప్ ఉంటుంది. అంటే.. తక్కువ రోజుల్లో ఈ సినిమా పూర్తి చేయగలగాలి. అలాగని చుట్టేయకూడదు. క్వాలిటీ కావాలి. ప్రయోగాలు అవసరం లేదు. కమర్షియల్ సినిమానే కావాలి. ఇలా తక్కువ సమయంలో సినిమా ఎవరు తీస్తారా? అని చూస్తున్నాడట. నిజానికి త్రివిక్రమ్ తో ఓసినిమా చేయాలని మహేష్ గట్టిగా అనుకుంటున్నాడు. అయితేత్రివిక్రమ్ సినిమాని చెక్కుతూ ఉంటాడు. కనీసం యేడాదైనా సరే... సెట్స్‌పై ఉండాల్సిందే. త్రివిక్రమ్ గనుక.. ఫాస్ట్ గా సినిమా తీస్తా అని మాటిస్తే, మహేష్ సినిమా త్రివిక్రమ్ తో ఉంటుంది. లేదంటే.. మరో దర్శకుడు కావాలి. మరి మహేష్ మదిలో ఏముందో?