గోపీచంద్ - మారుతి కాంబినేషన్‌లో ఓసినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీనికి `పక్కా కమర్షియల్` అనే పేరు పరిశీలిస్తున్నారు. ఇందులో హీరో.. ఓ లాయర్. అవినీతి పరులందరి తరపునా.. వాదిస్తూ, గెలుస్తుంటాడట. నిజానికి ఈ పాత్ర కోసం రవితేజని అనుకున్న సంగతి తెలిసిందే. పారితోషికం విషయంలో పేచీ వచ్చి. ఆయన తప్పుకున్నాడు. ఆ తరవాత గోపీచంద్ దగ్గరకు వచ్చింది.
అసలు అంతకంటే ముందు ఈ కథలో హీరో.. పవన్ కల్యాణ్ అని తెలిసింది. పవన్ ని దృష్టిలో ఉంచుకునే ఈ కథని మారుతి రాసుకున్నాడట. అయితే ఈ కథని పవన్ కి వినిపించడం కుదర్లేదు. పవన్ కి ప్రత్యామ్నాయంగా గోపీచంద్ కనిపించడంతో.. ఆయన దగ్గరకు వెళ్లాడు. చివరికి అది గోపీచంద్ కి ఫిక్సయ్యింది. ఏ కథపై ఎవరి పేరు రాసి పెట్టుందో.. ఎవరు చెప్పగలరు?