కరోనా నేపథ్యంలో 'సర్కారు వారి పాట' సినిమా ఆలస్యమవుతోందిగానీ, లేదంటే ఈ పాటికి సినిమా నిర్మాణం దాదాపు పూర్తయిపోయేదేమో.! చాలా సినిమాల పరిస్థితి ఇదే. మహేష్ కాస్త లేటుగా సినిమాలు చేస్తాడన్న పేరుంది. పవన్ కళ్యాణ్ కూడా అంతే. అయితే, మహేష్ కెరీర్‌లో వేగం పెంచాలనుకున్నాడు 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత. అందుకే 'సర్కారు వారి పాట' అన్నాడు. కానీ, కరోనా దెబ్బ పడింది మహేష్ ప్లానింగ్‌కి. చాలా సినిమాలు లాక్‌డౌన్ తర్వాత షూటింగులు తిరిగి ప్రారంభించాయి. కొత్త సినిమాలు కూడా షురూ అయ్యాయి. వాటిల్లో కొన్ని రిలీజ్‌కి రెడీ అయిపోతున్నాయి కూడా. కానీ, మహేష్ మాత్రం జనవరి వరకూ షూటింగ్‌ని పోస్ట్‌పోన్ చేసేశాడు. రిస్క్ ఎందుకు.? అన్న కోణంలోనే మహేష్ ఇలా చేశాడా.? అన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.
అయితే, ప్రస్తుతం చాలా సినిమాలు నిర్మాణ దశలో వున్న దరిమిలా, రిలీజ్ కోసం కూడా టైమ్ చూసుకోవాలి. ఆ లెక్కన, ఇప్పుడు వేగంగా సినిమా చేసేస్తే, రిలీజ్ ఎలా.? ఇవన్నీ ఆలోచించే మహేష్ పెర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో రంగంలోకి దిగాలనుకుంటున్నాడట. షూటింగ్ షురూ అయితే, గ్యాప్ పెద్దగా లేకుండా, వీలైనంత తొందరగా సినిమాని ఫినిష్ చేసెయ్యాలన్నది మహేష్ ప్లానింగ్‌గా కనిపిస్తోంది. ఈ గ్యాప్‌లో మహేష్ మరికొన్ని సినిమాల విషయమై కూడా క్లారిటీ ఇచ్చేయాలనుకుంటున్నాడట. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే దిశగా మహేష్ అడుగులేస్తున్నాడన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. 'సర్కారు వారి పాట'లో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా, ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు.