సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఏకంగా తమ హీరో తీరుకి వ్యతిరేకంగానే నినాదాలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఆ వివరాల్లోకి వెళితే, మహేష్ బాబు హైదరాబాద్ లోని అమరావతి ధియేటర్ నందు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు అన్న సమాచారంతో ఆయన అభిమానులు ఆ ప్రాంతానికి తరలివచ్చారు. అయితే ఆ ధియేటర్ చాలా కాలం నుండి మూసి ఉండడంతో యూనిట్ వారు తగిన సెక్యూరిటీ చర్యలు చేపట్టలేదు.
ఇక అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో వారిని అదుపు చేసే పరిస్థితి లేకుండాపోయింది. ఈ తరుణంలో మహేష్ ని అభిమానులతో కలిపివ్వమని ఆయన వ్యక్తిగత సిబ్బందిని కోరగా వారు నిరాకరించడం అలాగే వెనుక ద్వారం గుండా మహేష్ వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా అభిమానులు కోపోద్రిక్తులయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, మహేష్ వ్యక్తిగత సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.