టాలీవుడ్‌లోని హీరోలందరికంటే అందగాడు ఎవరూ.. అని అడిగితే మహేష్ బాబు పేరు చెబుతారంతా. పెరుగుతున్న వయసు ప్రభావం మహేష్‌పై అస్సలు కనిపించదు. పైగా... ఇప్పుడు మరింత యంగ్‌గా కనిపిస్తున్నాడు. వర్కవుట్లు చేసి బాడీ షేపప్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. అయితే మహేష్ మంచి భోజన ప్రియుడు. ఇంట్లోనే తనకు ఇష్టమైన అన్ని రకాల వంటల్ని ఇష్టంగా చేయించుకుని ఆరగిస్తాడు.
మహేష్ ఫేవరెట్ డిషఖ్.. మటన్, మునక్కాడ. వర్షాకాలం.. సాయింత్రం మిరపకాయ బజ్జీలు తింటూ, అల్లంటీ తాగడం అంటే తనకు మరింత ఇష్టం. ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు మహేష్. లాక్డౌన్ లోనూ ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నాడు మహేష్. అలా చేసిన ఓ చిన్న చిట్ చాట్ తో మహేష్ ఇష్టాయిష్టాలు ఇలా బయటకు వచ్చేశాయ్.