మహేష్‌ విషయంలో ఇది మరీ టూ మచ్‌!

మరిన్ని వార్తలు

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హ్యాట్రిక్‌ కొట్టేశాడు.. 'భరత్‌ అనే నేను', 'మహర్షి' సినిమాల సక్సెస్‌ల తర్వాత తాజాగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుని హ్యాట్రిక్‌ పూర్తి చేశాడు మహేష్‌బాబు. అయితే, సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న ఫేక్‌ గ్రాస్‌లు, ఫేక్‌ షేర్స్‌ కారణంగా.. మహేష్‌ని విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు హేటర్స్‌. 'నో బ్రేక్‌ ఈవెన్‌ స్టార్‌ మహేష్‌' అనే హ్యాష్‌ ట్యాగ్‌ని హేటర్స్‌ ట్రెండింగ్‌లోకి తీసుకురావడం అందర్నీ షాక్‌కి గురిచేస్తోంది. 'భరత్‌ అనే నేను', 'మహర్షి' సినిమాలతో సొసైటీకి మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేసిన మహేష్‌, చాలాకాలం తర్వాత ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ని 'సరిలేరు నీకెవ్వరు'తో చేసిన విషయం విదితమే.

 

ఈ సినిమాకి వసూళ్ళు పోటెత్తుతున్నాయి. మరోపక్క, 'అల వైకుంఠపురములో' సినిమాకి కూడా సూపర్‌ హిట్‌ టాక్‌ రావడంతో.. ఈ రెండు సినిమాల మధ్యా అభిమానులు పోలికలు తెస్తూ, ఓ సినిమాని ఇంకొకరు కించపరుస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో ఎక్కువగా మహేష్‌ ట్రోల్‌ అవుతున్నాడు. 'నో బ్రేక్‌ ఈవెన్‌ స్టార్‌ మహేష్‌' అన్న హ్యాష్‌ ట్యాగ్‌ అయితే మహేష్‌ని దారుణంగా అవమానపర్చేలా వుంది. సినీ పరిశ్రమలో హీరోల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతున్న మాట వాస్తవం. మరి, అభిమానులెందుకిలా సోషల్‌మీడియాకెక్కి పైత్యం ప్రదర్శిస్తున్నారన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఏదిఏమైనా ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు పెద్ద విజయాల్ని అందుకోవడం తెలుగు సినీ పరిశ్రమకి మంచిదే కదా.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS