ఇస్మార్ట్‌ పాపకి.. ఏంటీ ఎదురుచూపులు?

మరిన్ని వార్తలు

ఇస్మార్ట్‌ హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ తొలి రెండు సినిమాలతో ఫాప్‌ చవిచూసినా, ముచ్చటగా మూడో సినిమాతో హిట్టు కొట్టేసింది. మరో హిట్‌ కోసం ఈ బ్యూటీ ఇప్పుడు ఎదురుచూడాల్సి వస్తోంది. ప్రస్తుతం నిధి అగర్వాల్‌, అశోక్‌ గల్లా హీరోగా నటిస్తోన్న సినిమాలో హీరోయిన్‌గా చేస్తోన్న విషయం విదితమే. ఇది కాకుండా తమిళంలో ఈ బ్యూటీకి రెండు సినిమాలున్నాయి. మరోపక్క, బాలీవుడ్‌ నుంచి వస్తోన్న ఆఫర్స్‌ని మాత్రం నిధి లైట్‌ తీసుకుంటోందట. పూర్తిగా తన ఫోకస్‌ ఇప్పుడు టాలీవుడ్‌ మీదనే వుందనీ, దాంతోపాటుగా తమిళ సినిమాలూ చేస్తానని అంటోన్న నిధి అగర్వాల్‌, త్వరలో కొన్ని బిగ్‌ ప్రాజెక్ట్స్‌ ఓకే అవుతాయనే ధీమా వ్యక్తం చేస్తోంది.

 

అయితే, ఎందుకో 'ఇస్మార్ట్‌ శంకర్‌' హిట్టయ్యాక కూడా నిధి అగర్వాల్‌కి ఆశించిన స్థాయిలో పెద్ద అవకాశాలు రాలేదు. చిత్రంగా మరో ఇస్మార్ట్‌ హీరోయిన్‌ నభా నటేష్‌కి మాత్రం అవకాశాలు పోటెత్తుతున్నాయి. ప్రస్తుతం నభా నటేష్‌ వరుస సినిమాలతో బిజీగా వుంది. కాగా, సినిమాలు తక్కువగానే వున్నా 'ఇస్మార్ట్‌ శంకర్‌' సక్సెస్‌తో నిధి అగర్వాల్‌కి కమర్షియల్‌గా బాగానే వర్కవుట్‌ అవుతోందట. షోరూం ప్రారంభోత్సవాలు ఈ బ్యూటీకి చాలా ఎక్కువగానే వస్తున్నట్లు తెలుస్తోంది. అలా ఆ వైపుగా ఎక్కువ ఆలోచిస్తున్న నిధి, కెరీర్‌ మీద స్పెషల్‌ ఫోకస్‌ పెట్టకపోతే కష్టమేనని అంటున్నారు. ఇదిలా వుంటే, వరుణ్‌ సరసన నిధి అగర్వాల్‌ ఓ సినిమా చేయబోతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS