సూపర్ స్టార్ మహేష్ బాబు ఈమధ్యనే ఆయన చిత్రం భరత్ అనే నేను కోసం పనిచేసిన డైరెక్షన్ టీం కి సుమారు రూ తొంబై వేల విలువగల 11 మొబైల్ ఫోన్లు ఇచ్చాడు అని వార్తలు వచ్చాయి.
అయితే ఈ ఫోన్ల లెక్క 11 కాదని ఆ లెక్క సుమారు 50 దాటింది అని సమాచారం. ఇది తెలిసినవారంతా ఇప్పుడు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే సుమారు రూ 45-50 లక్షల వరకు తన యూనిట్ కోసం ప్రత్యేకంగా ఖర్చు చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఎల్లుండి భరత్ అనే నేను చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీనికి సంబంధించి మహేష్ బాబు ప్రచార కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే సినిమా యూనిట్ మొత్తం కూడా ఈ చిత్రం విజయం పైన అందరు నమ్మకంగా ఉన్నారు.
మొత్తానికి మహేష్ తన టీంలో విడుదలకి ముందే ఆనందాన్ని నింపాడు.