మహేష్‌ - కైరా రొమాన్స్‌ అదరగొట్టేస్తున్నారు

By iQlikMovies - April 06, 2018 - 15:24 PM IST

మరిన్ని వార్తలు

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం 'భరత్‌ అనే నేను'. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న కొలదీ, చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ వేగవంతం చేసింది. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అందుకే ఇంతవరకూ పొలిటికల్‌ కలరింగే ఇచ్చారు సినిమాకి. 

టీజర్‌ని కూడా ఆ యాంగిల్‌ నుండే కట్‌ చేశారు. అయితే ఇప్పుడు మరో యాంగిల్‌ని కూడా టచ్‌ చేసింది చిత్ర యూనిట్‌. అదే రొమాంటిక్‌ యాంగిల్‌. ఈ సినిమాతో బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వానీ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోంది. మహేష్‌ - కైరాల మధ్య కెమిస్ట్రీ సూపర్బ్‌గా వర్కవుట్‌ అయ్యిందనీ తాజా పోస్టర్స్‌ ద్వారా తెలుస్తోంది. మొన్నీ మధ్య కైరా శారీలో మహేష్‌ పక్కన జంటగా నడిచొస్తున్న పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ఎంతో అందంగా, డిగ్నిఫైడ్‌గా ఉన్న ఈ లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. 

లేటెస్టుగా మహేష్‌ - కైరా రొమాంటిక్‌ స్టిల్‌ బయటికి వచ్చింది. కైరా ఈ స్టిల్‌లో సూపర్‌ హాట్‌గా కనిపిస్తోంది. అంటే, ఓన్లీ పొలిటికల్‌ గ్లామరే కాదు, హాట్‌ హాట్‌ హీరోయిన్‌ గ్లామర్‌ కూడా ఈ సినిమాలో ఉండబోతోంది కంగారు పడకండి అన్నట్లుగా ఈ పోస్టర్‌ని రిలీజ్‌ చేసినట్లుంది. కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS