ఈనెల 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా.. మహేష్ బాబు చిత్రాలకు సంబంధించిన అప్ డేట్స్ రావడం ఆనవాయితీ. ఈసారి కూడా భారీ ప్లాన్స్ వేసుకున్నారు. సర్కారు వారి పాట టీజర్.. కృష్ణ పుట్టిన రోజున వస్తుందనుకున్నారు. అదే రోజున త్రివిక్రమ్ - మహేష్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ఉంటుందనుకున్నారు.
అయితే ఇవేం లేవు. కరోనా కారణంగా.. చిత్రసీమ అల్లాడిపోతోంది. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. జన జీవనం అస్తవ్యస్థమైంది. ఇలాంటి సందర్భంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకునేంత ఓపిక, ఉత్సాహం ఎవరికీ లేవు. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో టీజర్లూ, ఫస్ట్ లుక్‌లూ రావడం అసాధ్యం. అందుకే.. ఈ రెండు ఈవెంటన్లనూ పోస్ట్ పోన్ చేసినట్టు సమాచారం. మళ్లీ షూటింగులు మొదలై, ఒకప్పటి వాతావరణం కనిపించినప్పుడు.... టీజర్, ఫస్ట్‌లుక్, టైటిల్ విడుదల చేసే అవకాశం ఉంది. సో.. కృష్ణ పుట్టిన రోజున వేడుకలేం లేనట్టే.