'మహర్షి' లీక్‌ రీషూట్‌కి దారి తీస్తుందా.!

మరిన్ని వార్తలు

భారీ బడ్జెట్‌ చిత్రాల విషయంలో లీకుల బెడద ఎప్పుడూ కొత్త తంటాలు తెచ్చిపెడుతోంది. తాజాగా మహేష్‌బాబు నటిస్తున్న 'మహర్షి' సినిమా నుండి లీకైన ఫోటోలు, వీడియో ఇప్పుడు చర్చనీయాంశమైంది. పొలాల్లో చిత్రీకరించిన ఈ సీన్‌ సినిమాకి అత్యంత కీలకమైన సీన్‌ అట. సినిమాని టర్న్‌ చేసే సన్నివేశంగా చిత్రయూనిట్‌ చెబుతున్నారు. ఇంత ఇంపార్టెంట్‌ సీన్‌ లీకవ్వడంతో చిత్రయూనిట్‌ షాక్‌లో ఉందట. 

 

ఈ షాక్‌ నుండి తేరుకుని చిత్ర యూనిట్‌ ఓ నిర్ణయానికి వచ్చిందనీ సమాచారమ్‌. ఈ సీనుకి సంబంధించి ఫోటోలే కాక, వీడియో కూడా బయటికి రావడంతో రీషూట్‌ చేయాలని అనుకుంటున్నారట. ఒకవేళ అదే జరిగితే అది మరింత వ్యయ ప్రయాసలతో కూడిన పని అని టెన్షన్‌ పడుతున్నారట. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్‌బాబు విదేశాల్లో పెద్ద బిజినెస్‌ మాగ్నైట్‌గా కనిపించనున్నాడు. మరో పాత్ర కోసం కాస్త రఫ్‌ లుక్‌లోనూ కనిపిస్తాడట. 

 

అలాగే కాలేజీ కుర్రోడి పాత్రలో కూడా మహేష్‌ సందడి చేయనున్నాడు. అల్లరి నరేష్‌ మహేష్‌బాబుకు స్నేహితుడిగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. స్నేహితుడి కోసం విదేశాల నుండి పల్లెటూరికి తిరిగొచ్చి ఈ బిజినెస్‌మేన్‌ ఏం చేసాడనేదే ఈ సినిమా కథ. 'భరత్‌ అనే నేను' సినిమాతో మంచి హిట్‌ కొట్టిన మహేష్‌బాబు ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నాడు. 'శ్రీమంతుడు' తరహాలో కూడా ఓ బిగ్‌ హిట్‌ ఈ సినిమాతో తన ఖాతాలో పడనుందని భావిస్తున్నారంతా. మహేష్‌కి జోడీగా ఈ సినిమాలో పూజాహెగ్దే నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS