నిజంగానే రామ్‌ 'ఇస్మార్ట్‌'.!

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో రామ్‌ తృటిలో పెద్ద వివాదం నుండి గట్టెక్కాడు. ఆంధ్రప్రదేశ్‌లో కియా కార్ల సంస్థ తొలి కారును ఉత్పత్తి చేసిన దర్మిలా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ విషయంపై ట్వీట్‌ చేస్తే, రామ్‌ స్పందించాడు. అందులో 'మా రాష్ట్రం' అని పేర్కొన్నాడు రామ్‌. ఒక్కసారిగా అందరూ షాక్‌ అయ్యారు. కామెంట్లు పోటెత్తాయి. తెలంగాణాలో ఉంటూ ఆంధ్రప్రదేశ్‌ని 'మా రాష్ట్రం' అంటావేంటీ.? అని ప్రశ్నించారు. అయితే రామ్‌ ఇస్మార్ట్‌గా ఆలోచించాడు. ఇంకో ట్వీటేశాడు. 

 

ఏపీ నాదే తెలంగాణా నాదే.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా వ్యవహరిస్తాను అని చెప్పాడు. 'నా ఇల్లు సక్కపెట్టేటోడు ఎవరైతే నాకేంటి.? అన్నాయ్‌ నువ్వు చెయ్‌.. నీకేస్తా ఓ ట్వీటు..ఆంద్రా నాదే, తెలంగాణా నాదే.. ఇదే మాట మీద ఉంటా. కులం లేద్‌, ప్రాంతం లేద్‌, డిస్కషన్‌ అస్సల్‌ లేద్‌.. లవ్‌, ర్యాపో, సిటిజన్‌ ఫస్ట్‌ యాక్టర్‌ నెక్ట్స్‌..' అని ముగించాడు. మామూలుగా అయితే తెలంగాణా ప్రభుత్వం ఏ పని చేసినా తెలుగు సినీ పరిశ్రమ ముందుకొస్తుంటుంది. చిత్రంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసే పనుల గురించి స్పందన పెద్దగా కనిపించదు. 

 

సినీ పరిశ్రమలో చాలా మంది ప్రముఖులు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే అయినా, ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ హైద్రాబాద్‌లో ఉంది కనుక చాలా విషయాల్లో వారంతా మౌనం దాల్చుతున్నారు అనుకోవాలేమో. లేనిపోని వివాదాలెందుకు అన్న కోణంలోనే చాలా మంది మౌనం దాల్చుతుంటే, ఒకరిద్దరు పెదవి విప్పి, వివాదాలు కొనితెచ్చుకుంటున్నారు. రామ్‌ మాత్రం ఇస్మార్ట్‌గా ట్వీటేసి వివాదాల నుండి ఎస్కేప్‌ అయ్యాడు. దటీజ్‌ 'ఇస్మార్ట్‌ రామ్‌'.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS