టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ సినిమా చేస్తోన్న విషయం విదితమే. కరోనా కారణంగా ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. త్వరలో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్ళేందుకు దర్శకుడు పరశురామ్, హీరో మహేష్‌బాబు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా వుంటే, మహేష్‌బాబు మనుసులో మల్టీస్టారర్ ప్లానింగ్ చాలా గట్టిగా జరుగుతోందట. కొద్ది రోజుల్లోనే మహేష్ తన ‘మల్టీస్టారర్’ ఆలోచనల గురించి పెదవి విప్పుతాడని సమాచారం. మహేష్‌కి అత్యంత సన్నిహితుడైన వంశీ పైడిపల్లి ఈ మల్టీస్టారర్‌కి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయట.
గతంలో రామ్ చరణ్‌తో ‘ఎవడు’ సినిమాని తెరకెక్కించిన వంశీ పైడిపల్లి అందులో తక్కువ నిడివి పాత్రే అయినా, పవర్ ఫుల్ రోల్‌లో అల్లు అర్జున్‌ని చూపించిన విషయం విదితమే. మహేష్ నటించబోయే మల్టీస్టారర్ కూడా అలాంటిదే కాబోతోందని గుసగుసలు విన్పిస్తున్నాయి. అయితే, మహేష్‌తోపాటు నటించే ఆ ‘యంగ్ స్టార్ హీరో’ ఎవరు.? అన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది. ఇదిలా వుంటే, ఎన్నో కాంబినేషన్స్ గురించి ప్లానింగ్స్ జరుగుతున్నప్పటికీ, కరోనా నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలో తెలియని పరిస్థితి కన్పిస్తోంది. అయితే, ఇప్పుడిప్పుడే మళ్ళీ షూటింగులకు వెళ్ళేందుకే స్టార్లు సిద్ధమవుతున్న నేపథ్యంలో ముందు ముందు బోల్డన్ని కాంబినేషన్స్‌పై క్లియర్ పిక్చర్ రావొచ్చు.