మహేష్‌కి బిస్కెట్టేసిన ప్రదీప్‌: ట్రెండింగ్‌ అయిపోయాడుగా!

మరిన్ని వార్తలు

బుల్లితెర యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు హీరోగా డెబ్యూ చేస్తున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా.?’ ఈ సినిమా నుండి లేటెస్ట్‌గా ‘నీలి నీలి ఆకాశం..’ అనే లిరికల్‌ సాంగ్‌ విడుదలైన సంగతి తెలిసిందే. అందరి దృష్టినీ ఆకర్షించేలా ఈ సాంగ్‌ని మహేష్‌బాబు చేతుల మీదుగా రిలీజ్‌ చేయించాడు ప్రదీప్‌. ఇంకేముంది.. మహేష్‌ అంటే మాటలా.? ప్రస్తుతం ట్రెండింగ్‌ అయిపోయి కూర్చుంది ఈ సాంగ్‌. సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. యూత్‌ని బాగా ఎట్రాక్ట్‌ చేస్తోంది. ఇంకేముంది ప్రదీప్‌కి పండగే. అబ్బో.. నాకూ ఇంత ఫాలోయింగ్‌ ఉందా.! అని ఆ రెస్పాన్స్‌ చూసి ప్రదీప్‌ ఆశ్చర్యపోయేంతలా ఈ సాంగ్‌ ట్రెండింగ్‌ అయిపోయింది.

 

ఇదంతా మహేష్‌ మహత్యమే అంటున్నాడు. మహేష్‌ రిలీజ్‌ చేశాడు కాబట్టే, ఈ సాంగ్‌కి అంత క్రేజ్‌ వచ్చింది.. అంటూ సూపర్‌ స్టార్‌ మహేష్‌ని తెగ మోసేస్తున్నాడు ప్రదీప్‌. ఇకపోతే, ఈ సినిమాకి దర్శకుడు ఎవరో తెలుసా.? బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ శిష్యగణంలో ఒకరైన మున్నా. సినిమాని చాలా బాగా తెరకెక్కించాడట. ఎస్వీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఎస్వీ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అమృతా అయ్యర్‌ అను అందమైన భామతో మన ప్రదీప్‌ ఈ సినిమాలో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS