లవ్‌కి బ్రేకప్‌ చెప్పేయనున్న రౌడీ స్టార్‌.!

మరిన్ని వార్తలు

అరె.. మన రౌడీ ఎప్పుడు లవ్‌లో పడ్డాడు.. బ్రేకప్‌ చెప్పేయడానికి.. అనుకుంటున్నారా.? ఇది రియల్‌ లవ్‌ కాదులెండి. రీల్‌ లవ్‌ ముచ్చట. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రం ట్రైలర్‌ తాజాగా విడుదలై సంచలనాలు సృస్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌ రిలీజ్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో విజయ్‌ చెప్పిన మాటలివే. ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమా తన లాస్ట్‌ లవ్‌ స్టోరీ అట. అంటే ఇకపై విజయ్‌ లవ్‌ స్టోరీస్‌లో నటించడా.? అని ఫ్యాన్స్‌ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకూ విజయ్‌ నటించిన సినిమాల్లో లవ్‌ పర్సెంటేజ్‌ ఎక్కువగానే ఉంటూ వచ్చింది. అయితే ఆ డోస్‌ ఈ సినిమాలో ఒకటి కాదు, రెండు కాదు, నాలుగు రెట్లు ఉండబోతోంది. ట్రైలర్‌ విడుదలయ్యాక సినిమాపై అంచనాలు నెక్స్‌ట్‌ లెవల్‌కి చేరుకున్నాయి.

 

‘మళ్లీ మళ్లీ రాని రోజు’ తదితర చిత్రాల్లో లవ్‌ యాంగిల్‌ని మోస్ట్‌ టచ్చింగ్‌గా చూపించిన దర్శకుడు క్రాంతి మాధవ్‌. తన అనుభవాన్ని, మనసునీ, ప్రేమనీ రంగరించి ఈ కథని సిద్ధం చేసినట్లున్నాడు. ఆ ప్రేమంతా సినిమాలో పుష్కలంగా కనిపించేటట్లే ఉంది. నలుగురు హీరోయిన్స్‌తో హీరో లవ్‌ని డీల్‌ చేయడమంటే చిన్న విషయం కాదు మరి. అయితే, టేకింగ్‌ బాగానే ఉన్నట్లు ట్రైలర్‌ ద్వారా అర్ధమవుతోంది. అయితే, ఇది జస్ట్‌ ట్రైలర్‌ మాత్రమే. అసలు బొమ్మ పడ్డాకే, సిసలైన రిజల్ట్‌ తేల్చేది. అందుకే లవర్స్‌ డే రోజు ఈ సినిమాకి రిలీజ్‌కి ముహార్తం ఫిక్స్‌ చేశారు. చూడాలి మరి, మన ‘లవర్‌’ని ప్రియమైన లవర్స్‌ అంతా ఆదుకుంటారో లేదో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS